సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

by Naveena |
సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
X

దిశ, కమ్మర్ పల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్సై జి.అనిల్ రెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై అనిల్ రెడ్డి మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ లో ఓటిపికాని, బ్యాంక్ ఖాతా నంబర్లు కానీ, ఆధార్ నంబర్ కానీ, పోలీసు వాళ్ళ డిపి తో వచ్చిన కాల్స్ కు కానీ ఎట్టి పరిస్థితుల్లో స్పందించకూడదని వివరించారు. విద్యార్థులు రోడ్లపై వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, మొబైల్ ఫోన్లు వాడటం వలన కంటి దుస్థితి లోపిస్తుందని, జ్ఞాపక శక్తి తగ్గుతుందని, నిద్ర పట్టకపోవడం వంటి జరుగుతాయని తెలిపారు. అందువల్ల విద్యార్థులు మొబైల్ ఫోన్ వాడటం తగ్గించాలన్నారు. అదేవిధంగా సైబర్ క్రైమ్ గురించి విద్యార్థులకు వివరించారు. ఒకవేళ ఇలాంటి ఏవైనా మీ మొబైల్ ఫోన్ కు వచ్చినచో వెంటనే స్పందించి పోలీస్ శాఖకు లేదా 1930 నెంబర్ కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పాఠశాల ప్రిన్సిపల్ గంగాధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed