Allu Arjun: థియేటర్లలోకి మళ్లీ ‘పుష్ప-2’.. ఎక్స్‌ట్రా ఫైర్ లోడింగ్ అంటూ మేకర్స్ ట్వీట్

by Hamsa |
Allu Arjun: థియేటర్లలోకి మళ్లీ ‘పుష్ప-2’.. ఎక్స్‌ట్రా ఫైర్ లోడింగ్ అంటూ మేకర్స్ ట్వీట్
X

దిశ, సినిమా: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun), బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌(Sukumar)ల కలయికలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’(Pushpa-2). దీనిని అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ సుకుమార్‌ రైటింగ్‌ సంస్థతో కలిసి ఈ సినిమాను నిర్మించాయి. అయితే ఇది విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన చిత్రంగా నిలిచింది. ఇక విడుదలైన తర్వాత ఇండియన్‌ బాక్సాఫీస్‌పై పుష్పరాజ్ చరిత్రను సృష్టించిన సంగతి తెలిసిందే.

కేవలం 32 రోజుల్లోనే భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా, ఇండియన్‌ నెంబర్‌వన్‌ ఫిల్మ్‌గా ‘పుష్ప-2’(Pushpa-2) నిలిచింది. అత్యంత ప్రతిష్టాత్మక, భారతీయులు గర్వించదగ్గ చిత్రం ‘బాహుబలి-2’ వసూళ్లను పుష్ప-2(Pushpa-2) అధిగమించింది. ఇదిలా ఉంటే.. తాజాగా, మూవీ మేకర్స్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ ప్రకటించారు. ఇందులో మరో 20 నిమిషాల కీలక సీన్స్ యాడ్ చేసినట్లు వెల్లడించారు. జనవరి 11 నుంచి పుష్ప-2 రీ లోడెడ్‌ వెర్షన్‌ థియేటర్స్‌లోకి రాబోతుందని తెలిపారు.

Advertisement

Next Story