ప్రజల పక్షాన దిశ అక్షర పోరాటం

by Naveena |
ప్రజల పక్షాన దిశ అక్షర పోరాటం
X

దిశ ,గుర్రంపొడు: ప్రజల పక్షాన నిరంతరం దిశ దినపత్రిక అక్షర పోరాటం కొనసాగిస్తుందని నాగర్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. దిశ దినపత్రిక 2025 క్యాలెండర్ ను మండలంలోని పార్టీ ఆఫీసులో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మీడియా రంగంలో ఇప్పటికే దిశ పత్రిక ప్రత్యేక స్థానం పొందిందని, ప్రజా సమస్యల వెలికి తీసి ప్రభుత్వానికి, ప్రజలకు, వారధిగా పత్రికలు పనిచేయాలని తెలిపారు. అలాగే దిశ యాజమాన్యానికి, సిబ్బంది పాఠకులకు, నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు, నూతన సంవత్సర,సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి, గాలి రవికుమార్, మండల అధ్యక్షులు తగుళ్ల సర్వయ్య, ప్రధాన కార్యదర్శి కంచర్ల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ జగదీశ్వర్ రెడ్డి, చలమల యాదవ రెడ్డి, కమతం జగదీశ్వర్ రెడ్డి, మేడి వెంకన్న ,జగదీశ్వర్ రెడ్డి, వెలగపూడి కరుణాకర్ రావు, దిశా రిపోర్టర్ పరమేష్, యూత్ నాయకులు, కాంగ్రెస్ మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed