గుప్త నిధులు గుర్తించేందుకు రెండు తలల పాము తరలింపు

by Sridhar Babu |
గుప్త నిధులు గుర్తించేందుకు రెండు తలల పాము తరలింపు
X

దిశ, చెన్నూర్ : రెండు తలల పాము తరలింలించిన కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు అటవీశాఖ రేంజ్ అధికారి శివ కుమార్ తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని అటవీశాఖ రేంజ్ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐదుగురు, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మూఢనమ్మకాలను నమ్ముతూ రెండు తలల పాముతో నిధులను గుర్తించవచ్చు అనే అసత్యపు ప్రచారాలను నమ్మి ఆ పామును తరలిస్తున్న క్రమంలో అటవీశాఖ అధికారులు పక్కా సమాచారంతో చింతలపెళ్లి గ్రామం వద్ద వారిపై దాడి చేసి నిందితులను పట్టుకున్కొనారు.

వారి వద్ద నుండి పాము తో పాటు, కారు, ద్విచక్ర వాహనం స్వాధీనపరచుకున్నట్లు ఆయన తెలిపారు. వైల్డ్ లైఫ్ యానిమల్ యాక్ట్ ప్రకారం వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు ఆయన తెలిపారు. మూఢనమ్మకాలను నమ్మి తప్పుడు పనులు చేస్తూ తమ భవిష్యత్తు నాశనం చేసుకోకూడదని, అటువంటి వ్యక్తులపై తప్పకుండా నిఘా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed