Pm Modi: ప్రజలు మీతోనే.. దేశం మెచ్చిన నాయకుడు మోడీ

by srinivas |   ( Updated:2025-01-08 13:01:14.0  )
Pm Modi: ప్రజలు మీతోనే.. దేశం మెచ్చిన నాయకుడు మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో జనం ఉత్సాహం చూస్తుంటే ఎక్కడా లేని ఉత్సాహం, అభిమానం కనిపిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని మోడీ పర్యటన సందర్బంగా ఏయూలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.


‘‘ విశాఖలో ప్రధాని మోడీ రోడ్ షో అదిరింది. ప్రధానిపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఉంది. ఈ రోజు చరిత్రలో మిగిలిపోతుంది. రూ. 2 లక్షల కోట్ల విలువైన పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇది నా జీవితంలో మొట్టమొదటి శుభదినం. విశాఖ చిరకాల వాంఛ రైల్వే జోన్‌కు పనులు ప్రారంభమయ్యాయి. నక్కపల్లిలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాం. ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. రాష్ట్రంలో కొత్తగా మూడు రైల్వే ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నాం. 10 జాతీయ రహదారులకు శంకుస్థాపన చేస్తున్నాం. ఏడు జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం జరుగుతుంది. దేశం మెచ్చే నాయకుడు మోడీ. ఏపీలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఢిల్లీలో కూడా ఎన్డీయే గెలుపు తధ్యం. దేశం కోసం మోడీ పని చేస్తున్నారు. ప్రజలందరూ ప్రధానితోనే ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలో సుపరి పాలన అందిస్తున్నారు. పీఎమ్ కిసాన్ నిధి కింద రైతులకు రూ. 6 వేలు అందిస్తున్నారు. కోవిడ్ సమయంలో ప్రారంభమైన 5 కేజీల బియ్యాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ’’ అని చంద్రబాబు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed