Martin Guptill : అంతర్జాతీయ క్రికెట్‌కు మార్టిన్ గప్తిల్ గుడ్ బై

by Sathputhe Rajesh |
Martin Guptill : అంతర్జాతీయ క్రికెట్‌కు మార్టిన్ గప్తిల్ గుడ్ బై
X

దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గప్తిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు బుధవారం వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. 2009లో అరంగేట్రం చేసిన గప్తిల్.. న్యూజిలాండ్ తరఫున మొత్తం 367 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 198 వన్డేలు, 122 టీ20లు, 47 టెస్ట్‌లు ఉన్నాయి. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు (3,531) చేసిన ఆటగాడిగా నిలిచాడు. వన్డేల్లో 7,346 పరుగులు చేసి న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఆడిన తొలి వన్డే మ్యాచ్‌లోనే సెంచరీ(122) అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 23 సెంచరీలను గప్తిల్ నమోదు చేశాడు. ‘చిన్ననాటి నుంచి న్యూజిలాండ్ జట్టుకు ఆడాలని కలలు కన్నా. దేశం తరఫున 367 మ్యాచ్‌లు ఆడటం గర్వంగా ఉంది. టీమ్ మేట్స్, కోచింగ్ స్టాఫ్‌కు ధన్యవాదాలు. అండర్-19 లెవల్ నుంచి కోచ్‌గా వ్యవహరించిన మార్క్ ఓడెనియల్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని గప్తిల్ అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed