దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు కేటీఆర్

by M.Rajitha |
దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: డీలిమిటేషన్ విధానంపై చర్చించేందుకు చెన్నైలో శనివారం నిర్వహించే దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం బయలుదేరింది. ఈ సదస్సులో ప్రస్తుత డీలిమిటేషన్ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న, భవిష్యత్తులో జరగబోయే నష్టాలను ఎండగడుతూ, ఈ అన్యాయాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేటీఆర్ ప్రసంగించనున్నారు. ప్రస్తుత డీలిమిటేషన్ విధానం దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని బలహీనపరుస్తుందని, దీని వల్ల దేశ ఆర్థికాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్న ఈ రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని కేటీఆర్ హెచ్చరించారు. ఆది నుంచి ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్, తన పార్టీ విధానాన్ని ఈ సమావేశంలో వివరించనుంది.

Next Story

Most Viewed