- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Pawan Kalyan: గొప్ప మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్ కూతురు.. తండ్రికి తగ్గ తనయురాలంటూ నెట్టింట ప్రశంసలు

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), నటి రేణు దేశాయ్(Renu Desai) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరికి ఆద్య(Aadhya), అకీరా నందన్(Akira Nandan) అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ పెళ్లైన కొన్నేళ్లకే మనస్పర్థలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకోగా.. రేణు దేశాయ్ మాత్రం పిల్లల బాధ్యత తీసుకుని సినిమాలకు దూరం అయింది. తన కూతురు, కొడుకు భవిష్యత్తు కోసం కొద్ది కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. కానీ రాణించలేకపోయింది. దీంతో రేణు దేశాయ్ ఓ ఎన్జీఓను ప్రారంభించి జంతువులకు సాయంగా ఉంటుంది. సొంతం డబ్బుతో వాటికి చికిత్స చేయిస్తోంది. అలాగే జంతువులపై దాడి చేసే వారికి శిక్ష పడేలా చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తోంది.
తాజాగా, రేణు దేశాయ్ తన కూతురు ఆద్య పుట్టినరోజు కావడంతో ఓ వీడియోను షేర్ చేసింది. అలాగే ఆద్య చేసిన పనికి తనకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది. బర్త్ డే కదా అని హడావిడి ఏమీ వద్దని, చాలా సింపుల్‌గా బర్త్ డేను సెలెబ్రేట్ చేయమని ఆద్య కోరింది. వాటికి ఖర్చు పెట్టే డబ్బుల్ని ఎన్జీవోకి వాడమని చెప్పింది. అలా ఎన్నో మూగ జీవాలకు ఆ డబ్బులు ఉపయోగపడతాయని సలహా ఇచ్చిందని తెలిపింది. ఇక తన కూతురు ఇలా చెప్పడంతో తల్లిగా రేణూ దేశాయ్ ఎంతో మురిసిపోయిందట. ప్రస్తుతం రేణూ దేశాయ్ షేర్ చేసిన వీడియో, వేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ అభిమానులు తండ్రికి తగ్గ తనయురాలు అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వయసులో అలా చేయడం గ్రేట్ అని కామెంట్లు చేస్తున్నారు.
Read More..
ఫ్యాన్స్‌కు బంపరాఫర్.. మెగాస్టార్ ఇంట్లో ఉండే ఛాన్స్.. దానికోసం ఏం చేయాలంటే?