- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
More work-less pay: పని ఎక్కువ.. జీతం తక్కువ.. భారతీయుల దుస్థితిపై సంచలన రిపోర్ట్!

More work-less pay: భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్న విషయం తెలిసిందే. ఇక జనాభాలో ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉంది. ఈమధ్యే చైనాను అధిగమించింది. అలాంటి భారత ఆర్థిక వ్యవస్థ పరంగా చూస్తే మాత్రం తొలిస్థానంలో లేదు. ఇక భారత్ లో ఉద్యోగులు, కార్మికుల జీతాల గురించి మాట్లాడుకుంటే..ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో జీతం తక్కువ.. పని ఎక్కువ. మన దేశంలో ఉద్యోగులు, కార్మికుల సగటు జీతం రూ. 50వేలుగా ఉంది. మనదేశంలో ఇప్పటికే పనిగంటలపై తీవ్ర చర్చ జరుగుతోంది. అంతేకాదు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై కూడా విమర్శలు వచ్చాయి. దీనికి తోడు మన దేశంలో ఒక ఉద్యోగి కనీస వేతనం గురించి కూడా చర్చ షురూ అయ్యింది.
అయితే ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో పని ఎక్కువ..జీతం తక్కువగా ఉంది. ఇతర దేశాలతో పోల్చితే భారత్ లో చాలా కంపెనీలలో ప్రజలు వారానికి 48గంటలు పనిచేస్తున్నారు. అంటే వారానికి 6 రోజులు రోజుకు 8గంటలు పనిచేసి.. ఒక రోజు సెలవు తీసుకుంటారు. ఇక ఇటీవల ఆర్థిక మాంద్యం భయాలతో చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఉద్యోగుల వేతనాలు కూడా తగ్గిస్తుండటం లేదా వేతనాలు పెంచకపోవడం వంటివి చేస్తున్న విషయం తెలిసిందే.
కాగా వారానికి 72 గంటలు వారానికి 90గంటలు పనిచేయాలనే పనివేళలపై ఇప్పుడు దేశంలో సర్వత్రా చర్చ మొదలైన సంగతి తెలిసిందే. దీనిని సమర్థించిన వారి కంటే వ్యతిరేకించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ఎందుకంటే దేశంలో పనిగంటల గురించి మాట్లాడుతున్న ప్రముఖులు జీతాల గురించి ఎందుకు ప్రస్తావించడం లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఎక్కువ పని, ఒత్తిడికి గురవౌతున్న ఉద్యోగుల జీతాలు ఇతర దేశాలతో పోల్చితే దారుణంగా ఉన్నాయంటున్నారు. అభివ్రుద్ధి చెందుతున్న రంగాల్లో ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నా..పనికి తగ్గ జీతాలు లభించడం లేదంటున్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడం ముఖ్యమే అయినప్పటికీ జీవితం అనేది నిచ్చెన లాంటిది కాదు. భద్రత, పనికి తగ్గ సరైన వేతనాన్ని కూడా బేరిజు వేసుకుంటున్నారు.