- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Betting: బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్‌లపై రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చు.. లోక్‌సభలో కేంద్రం వెల్లడి

దిశ, నేషనల్ బ్యూరో: ఆన్ లైన్ గేమింగ్ (Online gaming), బెట్టింగ్(Betting)ల నిషేధానికి రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశం రాష్ట్రాల పరిధిలోనే ఉందని తెలిపింది. బుధవారం లోక్ సభ ప్రశ్నోత్తరాల టైంలో ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ఎంపీ దయానిధి మారన్ (Dayanidhi Maran) అడిగిన ప్రశ్నకు సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini vaishnaw) సమాధానమిచ్చారు. రాజ్యాంగం ప్రకారం బెట్టింగ్ అంశం రాష్ట్ర జాబితా కిందకు వస్తుందని తెలిపారు. కాబట్టి దానిపై చట్టాలు చేసే హక్కు రాష్ట్రాలకు ఉందని వెల్లడించారు. ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటికే 1410 గేమింగ్ సైట్ లను నిషేధించామని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటోందని, అయితే చట్టబద్ధంగా దానిపై నియంత్రణ ఉంచుకోవడం రాష్ట్రాల బాధ్యత అని నొక్కి చెప్పారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 112ని ఉపయోగించి కూడా బెట్టింగ్‌పై చర్యలు తీసుకోవచ్చని తెలిపారు.
అంతకుముందు దయానిది మారన్ మాట్లాడుతూ.. ఆన్ లైన్ గేమింగ్‌లను నిషేధించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించిందని, కేంద్రం కూడా దానిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం తన బాధ్యత నుంచి తప్పించుకుంటుందా అని నిలదీశారు. ఆన్ లైన్ సైట్‌లను నిషేధించడానికి ఎంత సమయం కావాలని ప్రశ్నించారు. దీంతో అశ్విని వైష్ణవ్ ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ నైతిక అధికారాన్ని ప్రశ్నించే హక్కు దయానిధి మారన్‌కు లేదని, రాజ్యాంగంలో నిర్వచించిన సమాఖ్య విధానం ప్రకారం దేశం పనిచేస్తుందని తెలిపారు. రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలని, దేశ సమాఖ్య నిర్మాణాన్ని గౌరవించాలని సూచించారు.