Airtel: దేశంలోని 2,000 నగరాలకు ఐపీటీవీ సేవలను ప్రారంభించిన ఎయిర్‌టెల్

by S Gopi |
Airtel: దేశంలోని 2,000 నగరాలకు ఐపీటీవీ సేవలను ప్రారంభించిన ఎయిర్‌టెల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ దేశవ్యాప్తంగా 2,000 నగరాల్లో తన ఐపీటీవీ సేవలను అధికారికంగా ప్రారంభించినట్టు ప్రకటించింది. కస్టమర్లకు కొత్త తరహా స్క్రీనింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి ఐపీటీవీ సేవలను మరింత వేగవంతంగా విస్తరించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఈ సేవల్లో భాగంగా 350కి పైగా టీవీ ఛానెళ్లు, హై-స్పీడ్ వైఫై కనెక్టివిటీతో పాటు నెట్‌ఫ్లిక్, యాపిల్ టీవీ ప్లస్, అమెజాన్ ప్రైమ్, జీ5, సోనీలివ్ సహా 29 ప్రముఖ ఓటీటీ యాప్‌లను అందిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. ఎయిర్‌టెల్ ఐపీటీవీ ప్లాన్ ధర నెలకు రూ. 699 నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో 40 ఎంబీపీఎస్ వైఫై, 26 ఓటీటీ యాప్‌లు వస్తాయి. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో కనెక్షన్ కోసం బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు ప్రారంభ ఆఫర్ కింద నెల రోజుల పాటు ఉచిత సేవలు లభిస్తాయి. ఇతర ప్లాన్‌లలో రూ. 899 ద్వారా 100ఎంబీపీఎస్, 26 ఓటీటీ వస్తాయి. రూ. 1,099తో 200 ఎంబీపీఎస్ వైఫై, 28 ఓటీటీ యాప్స్, రూ. 1,599తో 300 ఎంబీపీఎస్ ఇంటర్నెట్, 29 ఓటీటీలు, రూ. 3,999తో 1జీబీపీఎస్ వైఫై స్పీడ్, 29 ఓటీటీ యాప్ సేవలు లభిస్తాయి. అన్ని ప్లాన్‌లలోనూ 350 టీవీ ఛానెళ్లు వస్తాయి. ఐపీటీవీ అనేది ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్. ఇది ఇంటర్నెట్ ద్వారా ఓటీటీలతో పాటు టీవీ ఛానెళ్లు ప్రసారం జరుగుతాయి. ఓటీటీ వినియోగం పెరిగిన నేపథ్యంలో కంపెనీలు వైఫై, ఓటీటీ, టీవీ ఛానెళ్లతో కూడిన సేవలను అందిస్తున్నాయి.

Next Story

Most Viewed