- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘మోగ్లీ’ నుంచి ది వైల్డెస్ట్ బీస్ట్ రాబోతుంది, చూస్తూ ఉండండి.. అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన మూవీ టీమ్(పోస్ట్)

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ యాంకర్ సుమ కనకాల(Suma Kanakala) తనయుడు రోషన్(Roshan) నటిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ’(Mogli). ‘కలర్ ఫొటో’ ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్(Sandeep Raj) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ సాక్షి మడోల్కర్(Sakshi Madolker) హీరోయిన్‌గా నటిస్తుంది. అంతకు ముందు పలు బ్రాండ్స్‌కు చెందిన యాడ్స్‌లో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు మోగ్లీ ఈ చిత్రంతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తోంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకుని సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి. ఈ క్రమంలో తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు.
ఈరోజు ఉగాది పర్వదినం(Ugadi Festival) సందర్భంగా సినీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘మోగ్లీ నుండి వచ్చిన అత్యంత క్రూరమైన మృగం రేపు మీ కాలక్రమాలను ఆక్రమించుకుంటుంది.. చూస్తూ ఉండండి, రేపు ఉదయం 10:08 గంటలకు ఓ సర్‌ప్రైజ్ ఉండబోతుంది’ అని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలాగే ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో కేవలం హ్యాండ్ మాత్రమే కనిపిస్తుంది. క్యాండిల్ పట్టుకుని అదే చేత్తో సిగరెట్ కూడా పట్టుకున్నాడు. మరి ఈ పోస్టర్ ఎవరిదో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.