కాసేపట్లో సిట్ విచారణకు విజయసాయి రెడ్డి.. ఇచ్చే స్టేట్‌మెంట్‌పై సర్వత్రా ఉత్కంఠ

by Shiva |   ( Updated:2025-04-17 04:24:48.0  )
కాసేపట్లో సిట్ విచారణకు విజయసాయి రెడ్డి.. ఇచ్చే స్టేట్‌మెంట్‌పై సర్వత్రా ఉత్కంఠ
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం (YCP Government) హయాంలో జరిగిన లిక్కర్ స్కాం (Liquor Scam)లో కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ మేరకు కేసులో మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy)కి బుధవారం నోటీసులను కూడా జారీ చేశారు. ఆ నోటీసులలో ఈనెల 18న విచారణకు హాజరుకావాలని పేర్కొనగా.. ఆయన ఇవాళే విచారణకు వస్తానంటూ సిట్ అధికారులకు కబురు పంపారు. దీంతో కాసేపట్లో ఆయన విజయవాడ పోలీసుల కమిషనరేట్ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు.

అయితే, కాకినాడ పోర్టు (Kakinada Port), సెజ్ వాటల (SEZs) కేసు విషయంలో ఈ నెల 12న సీఐడీ (CID) విచారణకు హాజరైన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కాం (Liquor Scam)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. స్కాంలో సూత్రధారి, పాత్రధారి రాజ్ కసిరెడ్డే (Raj Kasireddy)నని కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ సిట్ అధికారులు విజయసాయి రెడ్డి లిక్కర్ స్కాంలో చెప్పే వాస్తవాలు, ఇచ్చే సమాచారాన్ని స్టేట్‌మెంట్ రూపంలో రికార్డు చేయనున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఇదే కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డితో పాటు మరో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సీట్ నుంచి నోటీసులు అందాయి. ఈ మేరకు ఆయనను రేపు విచారణకు రావాలంటూ నోటీసులలో పేర్కొన్నారు. అయితే, విజయసాయి రెడ్డి సిట్ అధికారులు ఎదుట ఏం చెబుతారోనని అటు వైసీపీ శ్రేణుల్లో, ఇటు ప్రభుత్వ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.



Next Story

Most Viewed