RBI: 2025-26 ఆర్థిక సంవత్సరం ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశ షెడ్యూల్ విడుదల

by S Gopi |
RBI: 2025-26 ఆర్థిక సంవత్సరం ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశ షెడ్యూల్ విడుదల
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏప్రిల్ నుంచి మొదలయ్యే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీఎసీ) సమావేశాల షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చిలోపు మొత్తం ఆరు సమావేశాలను ఆర్‌బీఐ నిర్వహించనుంది. మొదటి ఎంపీసీ సమావేశం 2025, ఏప్రిల్ 7-9 తేదీల మధ్య జరగనుంది. ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్న సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో చివరి ఎంపీసీ సమావేశం గత నెల జరిగింది. ఈ సమావేశంలో ఐదేళ్లలో తొలిసారిగా కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతానికి సవరించింది.

2025-26 ఎంపీసీ సమావేశాల తేదీలు

మొదటి సమావేశం ఏప్రిల్ 7-9, 2025

రెండో సమావేశం జూన్ 4-6, 2025

మూడో సమావేశం ఆగస్టు 5-7, 2025

నాలుగో సమావేశం సెప్టెంబర్ 29-1, 2025

ఐదవ సమావేశం డిసెంబర్ 3-5, 2025

ఆరవ సమావేశం ఫిబ్రవరి 4-6, 2026

ఆర్‌బీఐ ఎంపీసీ సభ్యుల గురించి..

ఆర్‌బీఐ చట్టం ప్రకారం, ముగ్గురు ఎంపీసీ సభ్యులు సెంట్రల్ బ్యాంకులో పనిచేస్తున్నవారు ఉంటారు. గవర్నర్, ద్రవ్య విధానానికి బాధ్యత వహించే డిప్యూటీ గవర్నర్, ఆర్‌బీఐ బోర్డు ఎంపిక చేసిన మరొక అధికారి. మిగిలిన ముగ్గురిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఈ ప్యానెల్‌కు ఆర్‌బీఐ గవర్నర్‌ నేతృత్వం వహిస్తారు.

ప్రస్తుత సభ్యులు

ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా

ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ రంజన్

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎం. రాజేశ్వర్‌రావు

డా. నగేష్ కుమార్

సౌగత భట్టాచార్య

ప్రొ. రామ్ సింగ్

Next Story

Most Viewed