- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వేసవిలో ఈ కూరగాయను అస్సలు వదలకండి.. ఎన్నో ప్రయోజలున్నాయో తెలుసా!

దిశ, వెబ్ డెస్క్: ఎండలు దంచికొడుతున్నాయి. వేడి తాపం నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ఇక వేసవిలో ఎక్కువగా దొరికే కూరగాయల్లో దొండకాయ కూడా ఒకటి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, కాల్షియం వంటి పోషకాలు పుష్కంగా ఉంటాయి. వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇవి ఎంతగానో సాయపడతాయి. ముఖ్యంగా దొండకాయ తినడం వల్ల వేసవిలో డీహైడ్రేషన్ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. రోజూ రెండు పచ్చి దొండకాయలను తినడం లేదంటే వారంలో ఒకటి రెండు సార్లు దొండకాయ కూరను తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలను పొందచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
* శరీరాన్ని చల్లబరుస్తుంది: దొండకాయలో సహజ చల్లదనాన్ని కలిగించే లక్షణాలు ఉంటాయి. ఇది వేసవిలో వేడెక్కిన శరీరాన్ని చల్లబరచుతుంది. అలాగే తలనొప్పి, బలహీనత, దాహాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
* నీటి సమతుల్యం: దొండకాయలో 90%కి పైగా నీరు ఉంటుంది. ఇది శరీరానికి తగినంత హైడ్రేషన్ అందిస్తుంది. రోజు దొండకాయ రసం తాగడం ద్వారా శరీరంలో నీటిని సమతుల్యం చేసుకోవచ్చు.
* గుండె ఆరోగ్యం: దొండకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
* జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది: దొండకాయలోని ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. మలబద్ధకం సమస్యలు, అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలను తగ్గిస్తుంది. దొండకాయలో తక్కువ కాలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా మంచిది.
* చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం: చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచటంలో దొండకాయ సాయపడుతుంది. అలాగే వేసవిలో చర్మం పొడిగా మారడం, పిగ్మెంటేషన్, దద్దుర్లు వంటి సమస్యలను తగ్గిస్తుంది. దొండకాయతో పచ్చడి లేదా రసం తాగడం వల్ల చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.
* డిటాక్సిఫికేషన్: దొండకాయ శరీరాన్ని డిటాక్స్ చేసి, విషపదార్థాలను బయటకు తీయడంలో సహాయపడుతుంది. లివర్ పనితీరును మెరుగుపరచి, శరీరంలో ఉన్న టాక్సిన్లను తొలగిస్తుంది. వేసవిలో జలుబు, జ్వరం వంటి సమస్యలు తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే, వేసవిలో ఇది శరీరంలో తక్కువ ఉప్పు, నీటి నిల్వలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
* అయితే, పచ్చి దొండకాయ తినడం ఎక్కువ తినడం మంచిది కాదు. రోజుకు రెండు మాత్రమే తినడం ఆరోగ్యకరం.. అంతకుమించి తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలకు కారణం కావచ్చు.