నగర ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ రోజు ఆ రూట్లు అన్ని బంద్

by Mahesh |
నగర ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ రోజు ఆ రూట్లు అన్ని బంద్
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు శ్రీరామ నవమి (Sri Rama Navami) సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున శోభాయాత్రలు (Shobhayatra) నిర్వహించనున్నారు.అలాగే ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లో భాగంగా సన్ రైజర్స్ మ్యాచ్ (Sunrisers match) ఉండటంతో వేలాది అభిమానులు ఈ మ్యాచ్ చూసేందుకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఉప్పల్ పరిసర ప్రాంతాలతో పాటు శ్రీరాముని శోభాయాత్రలు జరగనున్న ప్రాంతాల్లో హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఇందులో శోభాయాత్రలో భాగంగా.. సౌత్ వెస్ట్ జోన్‌లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. అలాగే ఈస్ట్ జోన్ (East Zone) లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు (Traffic diversion) చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ అతిపెద్ద శోభాయాత్ర సీతారాం బాగ్ నుంచి బోయిగూడ కమాన్, ఎంజే మార్కెట్, పుల్లీ బౌలి, సుల్తాన్ బజార్‌కు ర్యాలీ కొనసాగనుంది. దీంతో ఆయా రూట్లలో ప్రయాణించాలనుకునే వాహన దారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు సూచించారు. కాగా నేటి శోభాయాత్ర కోసం దాదాపు 20 వేల మంది పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తును రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (Rapid Action Force), సిటీ‌ఆర్ రిజర్వ్, క్విక్ రియాక్షన్ టీం, సిటీ టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్, మఫ్టీ క్రైమ్ పార్టీ టీమ్ ఉండనున్నారు. శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలను ఫిక్స్ చేశారు. వీటిని బంజారా‌హిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ (Command Control Center)కు అనుసంధానం చేశారు. దీంతో ర్యాలీని అక్కడి నుంచి మానిటరింగ్ చేయనున్నారు.

Next Story

Most Viewed