- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మేము చేసిన పాపం ఏమిటి.. తిమ్మారావుపేట డబుల్‌బెడ్‌రూం లబ్ధిదారుల గోస!

దిశ, ఏన్కూర్ : అమ్మ పెట్టలేదు అడుక్కొని ఇవ్వలేదన్న సామెతగా ఉన్నది డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల గోస. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు నిర్వాకం వల్ల ఏనుకూరు మండలం తిమ్మారావుపేట గ్రామంలో నిర్మాణం జరిగిన డబుల్ బెడ్ రూమ్ లబ్బిదారుల గోస వర్ణతీతంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఉండటానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి. హడావిడిగా నిర్మాణం చెప్పడం జరిగింది. సుమారు 40 బెడ్ రూమ్ ఇల్లు గ్రామంలో నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ ఇల్లు నిర్మాణం అసంపూర్తిగా ఉండగానే, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు తప్పుడు రిపోర్టు ఇవ్వడంతో రెవెన్యూ అధికారులు రంగంలో ఇల్లు పూర్తయిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోకుండానే లబ్ధిదారుల కోసం 2023 సంవత్సరం మే 9వ తేదీన డ్రా వేయడం జరిగింది. 40 మందిని లబ్ధిదారుల డ్రాలో ఎంపిక చేసిన అధికారులు పూర్తిగా ఎనిమిదేళ్ల నిర్మాణం జరగకుండానే లబ్ధిదారులకు అప్పజెప్పడంతో, పూర్తి కాకుండానే ఇల్లు ఇస్తున్నారు ఏమిటని గిరిజనులు ప్రశ్నించడంతో త్వరలో పూర్తి చేసి మీకు ఇల్లు అప్పజెప్పడం జరుగుతుందని ఇటు డబుల్ బెడ్ రూమ్ పూర్తికాక, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లు మంజూరి కాక గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు.
నాటి నుండి నేటి వరకు అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదని ఇల్లు మంజూరైన లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు అసంపూర్తిగా ఉంటే డ్రా ఎందుకు వేయాలని అధికారుల పనితీరుపై గిరిజన లబ్ధిదారులు నిప్పులు చెరుగుతున్నారు. కొంతమందికి పూర్తి చేసిన ఇల్లు ఇవ్వడమేంటి, మాకు అసంపూర్తిగా ఉన్న ఇల్లు ఇవ్వడమేంటి, మేము ఏమి పాపం చేశామని ప్రశ్నిస్తున్నారు. పూర్తయిన ఇల్లు కూడా సౌకర్యాలు లేక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. బాత్రూంలు నిర్మించలేదు. ఫ్లోరింగ్ చేయలేదు. గోడలు చెమ్మ దిగుతున్నాయి. నాణ్యత లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేసి చేతులు దులుపుకున్నారని గిరిజన ఆవేదన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని తిమ్మారావుపేట గ్రామంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సత్వరమే పూర్తి చేసి మాకు ఇల్లు అప్పజెప్పాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
వర్షాకాలం వస్తుంది మా పరిస్థితి ఏమిటి : భూక్య పుష్ప
వర్షాకాలం వస్తుంది మా పరిస్థితి ఏమిటి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేసి. సుమారు మూడు సంవత్సరాలుగా వస్తున్న ఇంతవరకు ఇల్లు పూర్తి కాలేదు. వారు ఇల్లు మంజూరు చేశారని మేము ఉన్న ఇల్లును పీకి వేశాం. ప్రస్తుతం రేకుల షెడ్డులో కాలం గడుపుతున్నాం. మా బాధలు ఎవరు పట్టించుకుంటారు. తక్షణమే కలెక్టర్ స్పందించి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పూర్తి చేసి మాకు అందించాలి.
కిరాయి ఇంట్లో ఉంటున్నాం : గుగులోతు సుశీల
గత మూడు సంవత్సరాల క్రితం తిమ్మారావుపేట లో నిర్మాణం జరుగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు డ్రా లో మాకు మంజూరు అయింది. ఇల్లు అసంపూర్తిగా నిర్మాణం జరగడంతో. అధికారులు త్వరలో పూర్తిచేసే అప్ప చెబుతామని ఆనాడు మాటిచ్చారు. సుమారు మూడు సంవత్సరాలు అవుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పూర్తి కాలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చిందని మా కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి వెళ్ళి పొమ్మన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పూర్తికాక, నెలకు వెయ్యి రూపాయలకు అద్దెకు ఉంటూ కాలం గడుపుతున్నాం.