ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం లైఫ్‌లోనే ఓ మైలు రాయి.. యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2025-03-24 14:42:27.0  )
ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం లైఫ్‌లోనే ఓ మైలు రాయి.. యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘బట్టం బోలే’(Battam bole) అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈ బ్యూటీ తన ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయిపోయింది. అలాగే తన నటనతో కూడా బాగా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీ కాంత్(Rajinikanth) సరసన ‘పేట’(Peta) మూవీలో నటించి మెప్పించింది. ఈ సినిమాతో ఈ భామ గ్రాఫ్ చేంజ్ అయిపోయిందని చెప్పవచ్చు. దీంతో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. అలా వచ్చిన అన్ని చిత్రాల్లో నటించింది.

ఆ తర్వాత కోలీవుడ్‌లోనూ స్టార్ హీరో సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే రీసెంట్‌గా ‘తంగలాన్’(Thangalan) సినిమాతో అలరించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇందులో భాగంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సరసన ‘రాజా సాబ్’(Raja Saab) సినిమాతో మన ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి(Maruti) దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మాళవికతో పాటు ప్రభాస్‌తో నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ది కుమార్‌(Riddi Kumar)లు కూడా రొమాన్స్ చేయబోతున్నారు.

సంజయ్ దత్(Sanjay Dutt), అనుపమ్ ఖేర్(anupam Kher) వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి తమన్(Thaman) సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా మాళవిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఇక ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్.. ప్రభాస్‌తో నటించడం పై మీ ఫీలింగ్ ఏంటి అని అడుగగా.. దానికి ఆమె స్పందిస్తూ.. ‘ప్రభాస్‌తో నటించడం జీవితంలో ఓ మైలు రాయి’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా గతంలో మన డార్లింగ్ పంపించిన ఫుడ్, అతని మంచితనం గురించి ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ మనందరికీ తెలిసిందే.

Read More..

Pawan Kalyan: గొప్ప మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్ కూతురు.. తండ్రికి తగ్గ తనయురాలంటూ నెట్టింట ప్రశంసలు



👉 Read Disha Special stories


Next Story