- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఈ సీడబ్ల్యూసీ ఎంతో ప్రత్యేకం.. సమావేశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో: సీడబ్ల్యూసీ (CWC) సమావేశంలో దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించబోతున్నామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar) అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం సమావేశానికి పోయే ముందు మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై, కుల గణన సర్వేపై కూడా చర్చిస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే పనిలో భాగంగా సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతోందని చెప్పారు. ఈ మీటింగ్‌తో ఏఐసీసీ పెద్ద దేశ ప్రజలకు సందేశం ఇవ్వబోతున్నారని వివరించారు. మతోన్మాద శక్తులు ఈ దేశాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తున్న తరుణంలో ఈ సీడబ్ల్యూసీ సమావేశాలు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. అహ్మాదాబాద్‌లో పరిస్థితులు మారుతున్నాయని, కాంగ్రెస్ పార్టీకి మద్దుతుగా పవనాలు వీస్తున్నాయని అన్నారు. 11 ఏళ్లుగా ప్రధాని మోడీ అధికారంలో ఉండి అట్టడుగు వర్గాల ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. మోడీ ప్రభుత్వ విధానం పెత్తందారి వ్యవస్థను పెంచి పోషిస్తున్నాయని చెప్పారు. దేశంలో అందరూ సమాన అవకాశాలు రావాలని ఈ నేపథ్యంలోనే సమావేశాల్లో ప్రత్యేకత సంతరించుకుందని వివరించారు.
కాగా, గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి వందేళ్లు, సర్దార్ వల్లాబాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సీడబ్ల్యూసీ సమావేశాలకు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.