Video Viral:ఛీ ఛీ పాఠశాలలో ఇదేం పని.. చదువుకు బదులుగా ఆ పని నేర్పిస్తున్న ఉపాధ్యాయుడు.. చివరికి ఏమైందంటే?

by Jakkula Mamatha |   ( Updated:2025-04-19 05:57:01.0  )
Video Viral:ఛీ ఛీ పాఠశాలలో ఇదేం పని.. చదువుకు బదులుగా ఆ పని నేర్పిస్తున్న ఉపాధ్యాయుడు.. చివరికి ఏమైందంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: పిల్లలు పాఠశాల స్థాయి నుంచే మంచి అలవాట్లు నేర్చుకుంటారు. చిన్నప్పటి నుంచి ఎలా పెరిగితే పెద్దయ్యాక అలా తయారవుతారని పెద్దలు అంటుంటారు. ఈ క్రమంలో తమ పిల్లలు మంచి గుణగణాలు అలవర్చుకోవాలని, బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు బడికి పంపుతారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, పెద్దల పట్ల గౌరవం గా ఉండాలని టీచర్లు చెబుతుంటారు. కానీ ఓ పాఠశాలలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు బాధ్యత మరిచాడు.

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని కఠ్‌నీ జిల్లాలోని పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయుడు మద్యం తాగించాడు. అయితే.. ఆ టీచర్ మద్యానికి బానిస అని తెలుస్తోంది. ఈ క్రమంలో అతను మద్యం తాగి పాఠశాలకు వస్తాడని చెబుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు పాఠాలు బోధించడానికి బదులుగా వారికి మద్యం తాగడం ఎలానో నేర్పిస్తున్నారు. ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆ వీడియో వైరల్ కావడంతో.. జిల్లా కలెక్టర్ డాక్టర్ దిలీప్ యాదవ్ తీవ్రంగా స్పందించారు.

వెంటనే ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం.. అతన్ని సస్పెండ్ చేసినట్లు అధికారి తెలిపారు. అయితే విద్యార్థులకు మద్యం తాగడం నేర్పుతున్న వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తాను తప్పు చేయడమే కాకుండా విద్యార్థుల చేత కూడా తప్పు చేయిస్తున్నాడని ఫైర్ అయ్యారు.

https://x.com/IndiaToday/status/1913288618543862267



Next Story

Most Viewed