- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సిట్ విచారణకు హాజరైన మిథున్ రెడ్డి.. విజయసాయిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఫైర్

దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ స్కామ్ కేసు (Liquor Scam Case)లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy) ఇవాళ వ్యక్తిగత న్యాయవాదులతో కలిసి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు విజయవాడ (Vijayawada)లోని సిట్ కార్యాలయంలో అధికారులు ఆయనను విచారిస్తున్నారు. అయితే, శుక్రవారం రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) ఇచ్చిన వాంగ్మూలం మేరకు మిథున్‌రెడ్డిని అధికారులు కీలక ప్రశ్నలు సంధించే చాన్స్ ఉంది. మద్యం కుంభకోణంలో భారీగా లబ్ధి పొందిన కంపెనీల్లో ఒకటైన అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ (Adan Distilleries Private Limited) వెనక రాజ్ కసిరెడ్డి (Raj Kasireddy)తో పాటు మిథున్ రెడ్డి (Mithun Reddy) ఉన్నారని విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) ఇప్పటికే బహిరంగా వెల్లడించండం హాట్ టాపిక్‌గా మారింది.
ఈ క్రమంలోనే ఇవాళ మిథున్ రెడ్డి వెంట సిట్ కార్యాలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్ (Korumutla Srinivas) మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. విజయసాయి రెడ్డి తమ పార్టీ నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అని అన్నారు. ఆయన పక్కాగా టీడీపీ (TDP) రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువతున్నారంటూ ఫైర్ అయ్యారు. జగన్ సన్నిహితులపై బుదరజల్లాలనే మిథున్ రెడ్డికి సిట్ అధికారులు కుట్రపూరితంగా నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్‌పై విచారణ జరపడం కాదని.. కూటమి ప్రభుత్వం హయాలో లిక్కర్ దందాపై విచారణ చేపట్టాలని కోరుముట్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.