- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బీరు తాగి మేక హల్చల్... గిరా గిరా తిరుగుతోంది!

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా (Social media ) వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో... రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. జంతువులు, ఏదైనా వింత సంఘటనలు, పక్షులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. కొంత మంది కావాలనే మూగ జీవులను హింసించి మరీ... వాటి వీడియో లో వైరల్ చేస్తూ.. శునకానందం పొందుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా... ఓ మేకకు ( Goat ) సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అదేంటి మేక వీడియో కూడా వైరల్ అవ్వడం ఏంటని అనుకుంటున్నారా ? ఇక్కడే ఉంది అసలు విషయం.
మందలో ఉన్న ఓ తెల్ల తోలు మేక.. బీర్ బాటిల్ ( Beer Bottle) తాగేసింది. ఓ వ్యక్తి.. తాను తాగే బీర్ బాటిల్ ఓపెన్ చేసి... ఆ మేకకు తాగించాడు. అయితే ఆ మూగ జంతువుకు... బీర్ అని తెలియక... మంచినీళ్ళ లాగా మొత్తం తాగేసింది. ఆ బీరు తాగిన తర్వాత.. మందుబాబులు ఊగినట్టే ఊగిపోయింది ఆ మూగ జీవి మేక. అంతే కాదు... తన తోటి మేకలపైకి వెళ్లి ఫైటింగ్ కూడా చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో.. ఆ బీరు తాగించిన వ్యక్తిని దారుణంగా నెటిజెన్స్ తిడుతున్నారు. అసలు నువ్వు మనిషివేనా..? మూగజీవులకు అలా బీర్లు తాగిస్తారా? నీది ఎక్కడి సంస్కృతి అంటూ... ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Just a goat snagging and chugging a beer, nothing out of the ordinary!pic.twitter.com/7zyvcRZkZA
— Shiva Verma (@iShivaVerma) April 7, 2025