- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్, అడ్వకేట్ క్లర్క్ వెల్ఫేర్ యాక్ట్ బిల్ అసెంబ్లీలో పాస్ అయింది. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముందుగా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ నిర్వహించగా.. అన్నిపార్టీల సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో బిల్ పాస్ అయినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం, 1992 (1992లో 13వ చట్టం) ప్రకారం న్యాయవాదుల సంక్షేమ నిధిని సమర్థవంతంగా నిర్వహించేందుకు పలు చర్యలు చేపట్టింది. ఈ నిధి ద్వారా న్యాయవాదులకు సంక్షేమ భత్యం, వైద్య సహాయం, అకాల మరణం లేదా శారీరక వైకల్యానికి గురైన వారికి ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు.
అందువల్ల, న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం కింద అవసరమైన నిర్ణయాలను తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. న్యాయవాదుల సంక్షేమ నిధి యోజనలను మెరుగుపరిచేందుకు న్యాయవాదులు తమ సూచనలు స్వేచ్ఛగా తెలియజేయాలని కోరారు. తెలంగాణ బార్ కౌన్సిల్, హైదరాబాద్‌లోని న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో చర్చలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. అలాగే, న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం ప్రకారం న్యాయవాదుల సభ్యత్వ రుసుమును సవరించారు. ప్రస్తుతం ఇది రూ.100 ఉండగా.. రూ.250లకు పెంచారు. ఈ నిర్ణయంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.