- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IPL - 2025: మ్యాచ్ మధ్యలో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన SRH ఆటగాడు

దిశ, వెబ్‌డెస్క్: ‘వావ్ సూపర్ ఫోర్.. అనుకునేలోపే మరో భారీ సిక్సర్. కనికరం లేని బ్యాటింగ్.. చెమటలు కక్కుతున్న బౌలర్లు’.. ఇంత రసవత్తర మ్యాచ్ మధ్యలో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ప్లేయర్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. ఫస్ట్ ఇన్సింగ్స్ ముగిసిన తర్వాత ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్లంతా ఫీల్డింగ్‌కు వచ్చారు. యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) బౌండరీ లైన్ వద్దకు వచ్చాడు. ఈ క్రమంలోనే కొందరు అభిమానులు.. ‘బ్రో పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్.. లవ్ మ్యారేజ్(Love Marriage) చేసుకుంటున్నారా? అరేంజ్‌డ్ మ్యారేజ్(Arranged Marriage) చేసుకుంటున్నారా?’ అని గట్టి గట్టిగా అరిచారు. అలాగే అరుపులు కేకలతో హోరెత్తించారు. దీంతో చేసేదేం లేక వారికి నితీష్ క్లారిటీ ఇచ్చారు. చాలా స్పష్టంగా లవ్ మ్యారేజ్ చేసుకోవట్లేదని హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ప్రపంచమంతా చుట్టేసినా.. మన తెలుగోడు పద్దతులు మర్చిపోలేదు’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు ఈ మ్యాచ్‌లో SRH గ్రాండ్ విక్టరీ సాధించింది. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్(SRH) బ్యాటర్లు వచ్చిన వాళ్లు వచ్చినట్లే దంచికొట్టారు. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి బోణి కొట్టారు. ఇషాన్ కిషన్ (106), ట్రావిస్ హెడ్ (67), క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి (30), అభిషేక్ శర్మ (24) మెరుపు ఇన్నింగ్స్ ఆడి.. ఏకంగా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేశారు. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టు కూడా చివరి వరకూ పోరాటం చేసింది. సంజు శాంసన్ (66)తో పాటు ధ్రువ్ జురెల్ (70), హెట్‌మయర్ (42), శుభమ్ దూబె (34) చెలరేగారు. తర్వాత వచ్చిన ప్లేయర్లు చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు. 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది.
Bro Marriage eppudu bro 😭😂#NitishKumarReddy pic.twitter.com/pUmbDM44Ez
— Movies4u Official (@Movies4u_Officl) March 24, 2025