- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మూడు బైక్ లను ఢీ కొన్న డీసీఎం..
by Sumithra |

X
దిశ, ఉప్పల్ : హబ్సిగూడ సిగ్నల్ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తార్నాక నుంచి వస్తున్న డీసీఎం వాహనం బ్రేక్ ఫెయిల్ అయి సిగ్నల్ వద్ద ఆగి ఉన్న మూడు బైకుల పై వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్‌తో పాటు బైకుల పై ఉన్న నలుగురికి గాయాలు అయ్యాయి. బైక్ పై ఉన్న ఒక మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో ఒక వ్యక్తి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అతని బైక్ పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story