Viral News: సన్నగా ఉండాలి.. 2000 సంవత్సరం తర్వాత పుట్టాలి.. గర్ల్‌ ఫ్రెండ్‌ ఎలా ఉండాలో పోస్టు పెట్టిన 35ఏళ్ల ప్రొఫెసర్!

by Vennela |   ( Updated:2025-03-24 04:17:42.0  )
Viral News: సన్నగా ఉండాలి.. 2000 సంవత్సరం తర్వాత పుట్టాలి.. గర్ల్‌ ఫ్రెండ్‌ ఎలా ఉండాలో పోస్టు పెట్టిన 35ఏళ్ల ప్రొఫెసర్!
X

దిశ, వెబ్ డెస్క్ : Viral News: పెళ్లి అనేది నూరేళ్లు అనుబంధం. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ సమయం నుంచి మరణించేంత వరకు వారితోనే కలిసి ఉండాలి. కాబట్టి మంచి వ్యక్తిని లైఫ్ పార్టనర్ గా సెలక్ట్ చేసుకోవాలి. కష్టసుఖాల్లో ఒకరొకకు తోడుగా ఉంటూ నిండు నూరేళ్లు జీవించడమే వివాహ బంధానికి అసలైన అర్థం. కానీ నేటి కాలంలో పెళ్లి అనే మాటకు పూర్తిగా అర్ధం మారిపోయింది. ఒక్కప్పుడు తల్లిదండ్రులకు చూసిన అమ్మాయి/అబ్బాయిని పెళ్లి చూసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు కాలం మారింది. అభిప్రాయాలు, అభిరుచులు మారాయి. తాము చేసుకోబోయే భాగస్వామిని తామే చేసుకునే రోజులివి. ఇలా ఉండాలి..అలా ఉండాలి అంటూ షరతులు పెడుతున్నారు. తమ భాగస్వామి ఎలా ఉండాలో చెబుతూ రకరకాల కోరికలను వ్యక్తం చేసుంటారు. తాజాగా చైనాకు చెందిన ఓ వ్యక్తి తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలో చెబుతూ ఓ లిస్టును తయారు చేశాడు. దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం జెజియాంగ్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మార్స్కిజంలో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన లూ అనే వ్యక్తి మ్యాచ్ మేకింగ్ చాట్ రూమ్ లో తన భాగస్వామి ఎలా ఉండాలో వివరించడం వైరల్ గా మారింది. మ్యాచ్ మేకింగ్ చాట్ రూమ్‌లో.. లూ తనను తాను 35 ఏళ్ల అందమైన యువకుడిగా అభివర్ణించుకున్నాడు. అతను 175 సెం.మీ ఎత్తు, 70 కిలోల బరువు, ఒక ప్రముఖ చైనీస్ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి పట్టా పొందానని, వార్షిక ఆదాయం 1 మిలియన్ యువాన్ (రూ.1.16 కోట్లు) అని పేర్కొన్నాడు. వీటన్నిటితో పాటు, అతను జెజియాంగ్‌లోని యివు నుండి వచ్చిన ఒక సంపన్న కుటుంబానికి ఏకైక కుమారుడిని అని చెప్పుకున్నాడు.

తన జీవిత భాగస్వామి గురించి లౌ అభిప్రాయాలలో.. తన కంటే 10 సంవత్సరాలు చిన్నదై ఉండాలని పేర్కొన్నాడు. ఆమె 2000 తర్వాత జన్మించిన వారై ఉండాలని షరతు పెట్టాడు. అంతేకాదు ఎత్తు 165 నుంచి 171 సెంటీమీటర్ల మధ్య ఉండాలి. సన్నగా, చాలా అందంగా ఉండాలని తెలిపాడు. చదువు విషయంలో చైనాలోని తొమ్మిది ప్రధాన విశ్వవిద్యాలయాలలో ఒకదాని నుండి కనీసం బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అదనంగా ప్రపంచవ్యాప్తంగా టాప్ 20లో స్థానం పొందిన విదేశీ సంస్థల నుండి గ్రాడ్యుయేట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటామని లూ పేర్కొన్నారు.

న్యాయశాస్త్రం లేదా వైద్యంలో మేజర్ ఉన్నవారికి అధిక ప్రాధాన్యత ఉంటుందని.. ఒకవేళ అందంగా ఉండి.. ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయితే వ్యక్తిగత నైపుణ్యాలు వంటి రంగాలలో అత్యుత్తమ లక్షణాలు ఉన్నవారికి కొన్ని రాయితీలు ఉంటాయని చెప్పాడు. ఈ పోస్టు చైనా సోషల్ మీడియా వివాదానికి, విమర్శలకు దారి తీసింది. ఈ పోస్టు చూసిన కొంతమంది నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ఓ నెటిజన్ ఇది పెళ్లి కాదు వేలం అని కామెంట్ చేయగా.. నువ్వు చదువుకున్న చదువు అంతా వృధా అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే ఈ ప్రొఫెసర్ పై యూనివర్సిటీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ యూనివర్సిటీ పేరును తప్పుగా వాడుకున్నాడంటూ మండిపడ్డారు. ఇప్పుడు ప్రొఫెసర్ డ్రీమ్ గర్ల్ ఏమో కానీ.. సోషల్ మీడియా మాత్రం అతనిపై దుమ్మెత్తిపోస్తుంది.

Read More..

Video Viral:‘చిన్న హృదయాలు.. గొప్ప ఆలోచన’.. తమ స్నేహితుడి కోసం ఏం చేశారో చూడండి!

Next Story