- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఐపీఎల్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు రాహుల్ దూరం?

- త్వరలో తండ్రి కాబోతున్న కేఎల్ఆర్
- భార్య ప్రసవ సమయంలో తనతో ఉండటానికే మొగ్గు
- సంచలన విషయం చెప్పిన అలీసా హీలీ
దిశ, స్పోర్ట్స్: ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్, బ్యాటర్ కేఎల్ రాహుల్.. తన ఫ్రాంచైజీ తరపున తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తరపున అద్భుతంగా రాణించిన కేఎల్ రాహుల్.. తండ్రి కాబోతుండటంతో ఐపీఎల్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు ఆడబోడని ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ అలీసా హీలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీసా హీలీ భర్త మిచెల్ స్టార్క్ ప్రస్తుతం ఢిల్లీ జట్టులో సభ్యుడిగా ఉండటంతో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాజాగా ఒక యూట్యూబ్ చానల్‌లో ఐపీఎల్‌కు సంబంధించిన విషయాలను మాట్లాడిన అలీసా హీలీ.. కేఎల్ రాహుల్ తండ్రి కాబోతుండటంతో తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే విషయం అనుమానమే అని చెప్పారు.
'ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో హారీ బ్రూక్ లేడు. అతనికి రీప్లేస్‌మెంట్గా ఎవరు వస్తారో చూడాలి. జట్టులో కేఎల్ రాహుల్ ఉన్నా.. త్వరలో తండ్రి కాబోతున్నందున.. తొలి రెండు మ్యాచ్‌లు ఆడటం అనుమానమే. కేఎల్ రాహుల్ ఉంటే తన జట్టు కోసం తప్పకుండా కష్టపడతాడు. అయితే తొలి రెండు మ్యాచ్‌లలో అతడు లేకపోవడం ఢిల్లీ జట్టుకు కొంచెం మైనస్ అనే చెప్పవచ్చు' అంటూ అలీసా హీలీ అన్నారు. టీ20 క్రికెట్‌లో కేఎల్ రాహుల్ చాలా అద్భుతమైన ప్లేయర్ అని.. అతడు ఉంటే తప్పకుండా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంటుందని హీలీ అభిప్రాయపడింది. కాగా, నిరుడు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్.. ఆ జట్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. కేఎల్ రాహుల్‌నే ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా చేస్తారని అందరూ భావించారు. అయితే నాయకత్వం వహిచడంపై రాహుల్ వెనక్కు తగ్గడంతో డీసీ కెప్టెన్‌గా అక్షన్ పటేల్‌ను నియమించారు. అయితే ఢిల్లీ తరపున ఈ సీజన్‌లో ఆడాల్సిన కేఎల్ రాహుల్.. తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడనే విషయం ఇప్పుడు అభిమానులను కలవరపెడుతోంది.