విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి

by Sridhar Babu |
విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి
X

దిశ, చర్ల : విద్యారంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం చర్ల మండలంలో పర్యటించిన ఆయన జూనియర్ కళాశాల, ఉంజుపల్లి ఆశ్రమ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల చుట్టూ ప్రహరీ గోడ లేక విద్యార్థుల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోందని జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని కళాశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టే విధంగా కృషి చేయాలన్నారు.

వేరే ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల డిప్యూటేషన్ తక్షణమే రద్దు చేసి ఇక్కడే విధులు నిర్వహించేలా చొరవ చూపాలన్నారు. డిప్యూటేషన్ పై ఉపాధ్యాయులు బయటి ప్రాంతాలకు వెళ్లడంతో ఇక్కడ ఉపాధ్యాయుల కొరత వేధిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బి.మురళీమోహన్, ప్రధాన కార్యదర్శి బి.నరసింహారావు, మాజీ జిల్లా అధ్యక్షులు ఏ.వెంకటేశ్వర్లు, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు సంఘం శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed