- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TGPSC:గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్.. ‘కీ’ విడుదల
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) గ్రూప్స్ పరీక్షల రిక్రూట్మెంట్ వేగం పెంచింది. ఇటీవల నిర్వహించిన గ్రూప్-3 'కీ' తాజాగా టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు ‘కీ’ చూసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌ను https://www.tspsc.gov.in/ సందర్శించండి. ఈ క్రమంలో మరో రెండ్రోజుల్లో గ్రూప్-2 'కీ' విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం నేడు(బుధవారం) మీడియాతో చిట్‌చాట్‌లో ఈ విషయం ప్రకటించారు. గతంలో జరిగిన తప్పిదాలు కమిషన్‌లో ఇకపై జరగవు అని తెలిపారు.
ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలు ఇస్తామన్నారు. కొత్త నోటిఫికేషన్లు మే 1 నుంచి జారీ చేస్తామని పేర్కొన్నారు. పరీక్ష ఫలితాలు ఎలాంటి ఆలస్యం లేకుండా ఇస్తామన్నారు. వారం పది, రోజుల వ్యవధిలో గ్రూప్-1,2,3 ఫలితాలు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ ఫార్మాట్లో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో షెడ్యూల్ ప్రకారం ఫలితాలు వచ్చేలా పనిచేస్తున్నామని, అభ్యర్థులెవరూ ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు. గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలు రాసిన అభ్యర్థులు ‘కీ’ ఎప్పుడు విడుదల అవుతుందోనని ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.