Rss workers: సీపీఎం నేత హత్య కేసు.. 9 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు జీవిత ఖైదు

by vinod kumar |
Rss workers: సీపీఎం నేత హత్య కేసు.. 9 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు జీవిత ఖైదు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని కన్నూర్ జిల్లాలో19 ఏళ్ల క్రితం జరిగిన సీపీఎం నేత రిజిత్ శంకరన్ (Rijith shankaran) హత్య కేసులో 9 మంది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకర్తలకు తలస్సేరి కోర్టు (Thalasseri court) జీవిత ఖైదు విధించింది. 2005లో సీపీఎం, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు మధ్య రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కన్నాపురం చుండాకు చెందిన సీపీఎం నేత రిజిత్‌పై అదే ఏడాది అక్టోబర్ 3న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో రిజిత్ మరణించగా ఆయన ముగ్గురు స్నేహితులు గాయపడ్డారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పది మందిపై అభియోగాలు మోపారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణలో ఉండగా ఈ నెల4న తలస్సేరిలోని అదనపు జిల్లా సెషన్స్ కోర్టు నిందితులను దోషిగా నిర్ధారించింది. ఈ క్రమంలోనే జీవిత ఖైదు విధిస్తూ తాజాగా తీర్పు వెల్లడించింది. అయితే నిందితుల్లో ఒక వ్యక్తి కేసు విచారణలో ఉండగానే మృతి చెందాడు. దీంతో మిగతా తొమ్మిది మందికి కోర్టు శిక్ష విధించింది.

Advertisement

Next Story