Ram Gopal Varma: బ్లాక్ బస్టర్ హిట్ ‘సత్య’ రీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఆర్జీవీ

by Hamsa |
Ram Gopal Varma: బ్లాక్ బస్టర్ హిట్ ‘సత్య’ రీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఆర్జీవీ
X

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి ఇండస్ట్రీలో రీ రిలీజ్(Re-release) ట్రెండ్ కొనసాగుతోంది. స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న చిత్రాలు కూడా రీరిలీజ్‌లో పుంజుకుంటూ భారీ కలెక్షన్లు రాబడుతున్నాయి. గతంలో హిట్ అందుకున్నవి మరోసారి థియేటర్స్‌లోకి వచ్చి రికార్డులు సాధిస్తున్నాయి. తాజాగా, రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) దర్శకత్వంలో వచ్చిన ‘సత్య’(Satya) మరోసారి థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ముంబై(Mumbai) మాఫియా గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం 1998లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడు మరోసారి జనవరి 17న రీ రిలీజ్ కానుంది. ఈ మేరకు ఆర్జీవీ ఓ కొత్త పోస్టర్‌ను కూడా షేర్ చేశారు.

Advertisement

Next Story