- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TPCC: మా బలం ముందు మీరెంత..! కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నదని, ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(TPCC Working President Jaggareddy) డిమాండ్ చేశారు. గాంధీభవన్(Gandhi Bhavan) లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. బీజేపీ కార్యాలయం(BJP Office) వద్ద జరిగిన ఘటనపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ విలువలతో కూడిన రాజకీయాలు చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసే ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)పై బీజేపీ నేత చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ నాయకులు ఖండించాల్సింది పోయి.. ప్రోత్సహించే విధంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
దీనికి నిరసనగా యూత్ కాంగ్రెస్ నాయకులు(Youth Congress leaders) బీజేపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించడం జరిగిందని తెలిపారు. ఈ ఘటనను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar goud) ఖండించడమే గాక మా యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ ను హెచ్చరించారని, కానీ బండి సంజయ్(Bandi Sanjay), కిషన్ రెడ్డి(Kishan Reddy)లు బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టి, గాంధీభవన్ మీదికి పంపడం సరికాదన్నారు. కేంద్రమంత్రులుగా ఉండి కార్యకర్తలను సమన్వయం చేయాల్సింది పోయి, ప్రోత్సహించేలా వ్యవహరించారని, తప్పు ఎక్కడ జరిగిందో మీరే తెలుసుకోవాలని సూచించారు. అసలు బీజేపీ మాజీ ఎంపీ ప్రియాంక గాంధీని అవమానపరిచేలా మాట్లాడకపోతే ఏ గొడవ ఉండేది కాదని, అనుచిత వ్యాఖ్యలు చేసేది మీరే.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేది మీరేనా అని మండిపడ్డారు.
మీరు రెచ్చగొడితే మా వాళ్లు రెచ్చిపోతారని, కాంగ్రెస్ బలం ముందు బీజేపీ బలం సరిపోతుందా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనపై బీజేపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని, బీజేపీ మహిళ నేతగా ఉన్న డీకే అరుణ(DK Aruna) ప్రియాంక గాంధీపై బిధూరీ చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తారా అని ప్రశ్నించారు. ఇక రాజాసింగ్(Raja singh) గాంధీభవన్ ను పేలుస్తా అని మాట్లాడుతున్నారని, ముందు ఆయన బీజేపీ ఆఫీస్ లోకి ఎంట్రీ తెచ్చుకోవాలని, తర్వాత గాంధీభవన్ కు రావాలని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.