- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Rashmika Mandanna: చేతికి కట్టుతో దర్శనమిచ్చిన రష్మిక మందన్న.. ఆందోళనలో ఫ్యాన్స్(పోస్ట్)
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘పుష్ప 2’. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఇండియాస్ ఫేమస్ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్‌లు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఓ స్పెషల్ సాంగ్‌తో అలరించనుంది. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అన్ని సినిమా పై మంచి హైప్‌ను తెచ్చిపెట్టాయి. దీంతో ఈ మూవీ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ప్రమోషన్లలో భాగంగా గురువారం చిత్రబృదం కొచ్చిన్‌లో ఈవెంట్‌ను నిర్వహించింది. ఇక ఈ ఈవెంట్‌కు అల్లు అర్జున్, రష్మికతో పాటు మూవీ యూనిట్ కూడా పాల్గొన్నారు. అయితే హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న వెళ్లారు. ఆ విమానంలో పుష్ప, శ్రీవల్లి సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫొటోను రష్మిక మందన్న తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ పిక్‌లో రష్మిక చేతికి కట్టు వేసుకొని ఉండటంతో చేతికి ఏమైంది అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. చెయ్యి బెణికితే లేదా నొప్పి పెడితే ఇలాంటి కట్టు వేసుకుంటారు కాబట్టి చిన్న సమస్యే అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.