బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ఎన్నికలు జరపాలి : ఎంపీ ఆర్.కృష్ణయ్య

by Kalyani |
బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ఎన్నికలు జరపాలి : ఎంపీ ఆర్.కృష్ణయ్య
X

దిశ, హిమాయత్ నగర్ : ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతానికి పెంచిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు జిల్లపల్లి అంజి అధ్యక్షతన 20 కుల సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఎంపీ. ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ కులగణన పూర్తి చేసారని.. 55 శాతం జనాభా ఉన్నట్లు తెలిసిందన్నారు. అసెంబ్లీ మొదట రిజర్వేషన్ల ను 20 శాతం నుంచి 42 శాతం పెంచుతూ అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డెడికేషన్ కమిషన్ ఉంది కాబట్టి అసెంబ్లీలో చట్టం చేస్తే చట్టపరమైన, న్యాయపరమైన అవరోధాలు ఉండవని తెలిపారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. బీసీల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారని, వెంటనే ఇప్పుడు 13 కార్పొరేషన్లకు తోడుగా మరో 40 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న 11 ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు నందగోపాల్, పగిళ్ల సతీష్, రాందేవ్, మల్లేష్, రమేష్ వీరన్న, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story