Breaking News : ఏసీబీ ఆఫీసు వద్ద పోలీసులపై కేటీఆర్ ఫైర్

by M.Rajitha |
Breaking News : ఏసీబీ ఆఫీసు వద్ద పోలీసులపై కేటీఆర్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నేడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు(Formula E Car Racing Case)లో ఏసీబీ విచారణ(ACB Interrogation)కు హాజరైన విషయం తెలిసిందే. సుమారు 7 గంటల విచారణ అనంతరం ఆయన ఏసీబీ ఆఫీసు నుంచి బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. కాగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతుండగా డీసీపీ విజయ్ కుమార్ వద్దని వారించారు. ట్రాఫిక్ కు డిస్టర్బ్ అవుతుందని, మీడియా పాయింట్ వద్ద మాట్లాడాని డీసీపీ కేటీఆర్ కు సూచించగా.. కేటీఆర్ అసహనానికి గురయ్యారు. మీడియాతో మాట్లాడుతుంటే మీకు వచ్చిన నొప్పి ఏమిటని పోలీసులను ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడితే రిపోర్టర్స్ పై ఎందుకు దాడి చేస్తున్నారని, వారితో మాట్లాడితే మీరెందుకు భయపడుతున్నారంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు. అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోయిన కేటీఆర్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. విచారణ విషయాలను వెల్లడించారు. ఏసీబీకి అన్ని విధాలా సహకరించానని, కొత్తగా అదిగినవి ఏమీ లేవని, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా తాను హాజరయ్యేందుకు సిద్ధం అన్నారు.

Next Story

Most Viewed