- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీజింగ్ వాహనాలలో చెలరేగిన మంటలు… 4 ఆటోలు, ఒక కారు దగ్ధం
by Kalyani |
X
దిశ, నర్సాపూర్ : సీజింగ్ వాహనాలలో మంటలు చెలరేగి నాలుగు ఆటోలతో పాటు ఓ కారు దగ్ధమైన సంఘటన నర్సాపూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపోలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నర్సాపూర్ ఆర్టీసీ బస్ డిపో ప్రాంగణంలో ఆర్టీఏ అధికారులు సీజ్ చేసిన వాహనాలను గతంలో పార్క్ చేశారు. సీజ్ చేసిన వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 4 టాటా ఏసీ ఆటోలతో పాటు ఒక కారు దగ్ధమయ్యాయి. గమనించిన ఆర్టీసీ డిపో సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో ఆర్టీసీ సిబ్బంది ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. మంటలు గమనించిన సిబ్బంది పక్కనే గల ఇతర బస్సులను దూరంగా తీసుకెళ్లి పార్క్ చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఆర్టీసీ సిబ్బంది భావించారు.
Advertisement
Next Story