Cars: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? టాటా నుంచి రూ. 6 లక్షల కంటే తక్కువ ధరలో 3 కొత్త కార్లు ఇవే

by Bhoopathi Nagaiah |
Cars: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? టాటా నుంచి రూ. 6 లక్షల కంటే తక్కువ ధరలో 3 కొత్త కార్లు ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: టాటా మోటార్స్(Tata Motors) మూడు సరికొత్త కార్లను త్వరలోనే మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. టాటా పంచ్(Tata Punch), టాటా టియాగో(Tata Tiago), టాటా టిగోర్ (Tata Tigor) ఫేస్ లిస్ట్ మోడల్స్ కూడా బడ్జెట్ ధరలోనే సామాన్యులకు అందుబాటులో ఉంటాయని సమాచారం. ప్రతి ఒక్క కుటుంబానికి కారు ఉండాలన్న రతన్ టాటా (Ratan Tata) లక్ష్యాన్ని నెరవేర్చేందుకు టాటా కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే కార్ల ధరలు కూడా చాలా వరకు తగ్గించి విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఆటో ఎక్స్ పో 2025 ఢిల్లీలోని భారత మండపంలో జనవరి 17 నుంచి జనవరి 22 వరకు ..ద్వారకా యశోభూమిలో జనవరి 18 నుంచి 21 వరకు నిర్వహిస్తారు. గ్రేటర్ నోయిడా ఎక్స్ పో మార్ట్ లో సెంటర్ లో జనవరి 19 నుంచి 22 వరకు జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ లో దేశ, విదేశాలకు చెందిన కంపెనీలతో పాటు దాదాపు 5లక్షల మంది పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

జనవరి 17వ తేదీ నుంచి ఢిల్లీ నోయిడాలో కార్ ఎగ్జిబిషన్(Car Exhibition) షురూ కానుంది. ఇందులో పలు ప్రముఖ కార్ల కంపెనీలు తమ కార్లను ప్రదర్శనలో ఉంచుతాయి. టాటా మోటార్స్ ఆటో ఎక్స్పో 2025లో మూడు కార్లను తీసుకురానుంది. మధ్యతరగతి కుటుంబ అవసరాలు తీర్చేలా ఈ కార్లను డిజైన్ చేసినట్లు టాటా కంపెనీ ప్రకటించింది. అందుకే వీటి ధర కూడా చాలా తక్కువగానే ఉండబోతుంది. కేవలం రూ.6 లక్షల లోపు ఉంటుందని సమాచారం. ఫేస్ లిస్ట్ మోడల్స్ ఆవిష్కరిస్తామని టాటా కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్న టాటా కొత్త కార్ల గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం

టాటా పంచ్ (Tata Punch)

టాటా మోటార్స్ ప్రముఖ మైక్రో SUV పంచ్ న్యూ లుక్ తో మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఎల్ఈడి ప్రొజెక్టర్, హెడ్ లాంప్, కొత్త గ్రిల్ డిఆర్ఎల్ లైట్ 10.25 అంగుళాల టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, వైర్లెస్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి లేటెస్ట్ ఫీచర్లు ఇందులో ఉంటాయి, దీని ధర కేవలం రూ. 6 లక్షల ఉండవచ్చు అంచనా వేస్తున్నారు.

టాటా టియాగో (Tata Tiago)

ఈ కారు సైజులో చిన్నగా ఉన్న డిజైన్ లో మాత్రం అద్భుతంగా ఉంటుంది. టియాగో కొత్త వెర్షన్ కూడా ఈ ఎగ్జిబిషన్లో మెరవనుంది. ఈ ఫేస్ లిస్ట్ మోడల్ లో కొత్త హెడ్ ల్యాంప్, డిఆర్ఎల్ తో కూడిన రేడియేటర్ గ్రిల్, వైర్లెస్ చార్జింగ్, యూఎస్బీ టైప్ సి పోర్ట్, కొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టం వంటి బెస్ట్ ఫీచర్లు ఈ టాటా టియాగో కార్ లో ఉండనున్నాయి. దీని ధర కూడా కేవలం 5 లక్షల వరకు ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు

టాటా టిగోర్ (Tata Tigor)

టాటా ప్రముఖ సెడాన్ టిగోర్ ఫేస్ లిస్టు కూడా ఎగ్జిబిషన్లో ఉండనుంది. 1.2 లీటర్ పెట్రోల్ సిఎన్జి ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఈ కారులో ఉండే ఛాన్స్ ఉంది. ఈ కారు లీటర్ పెట్రోల్ కి 19.4 నుంచి 28.06 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది. దీని ధర కేవలం రూ.6 లక్షల రూపాయలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story