Nagarjuna: తెలంగాణ టూరిజంపై సినీ నటుడు నాగార్జున ప్రమోషన్

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-09 12:24:28.0  )
Nagarjuna: తెలంగాణ టూరిజంపై సినీ నటుడు నాగార్జున ప్రమోషన్
X

దిశ, వెబ్‌డెస్క్: పర్యాటక రంగం(Telangana tourism) అభివృద్ధిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Congress Govt) దృష్టి సారించింది. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ప్రచారం కోసం ప్రముఖ చేత వీడియోలు చేయిస్తోంది. పర్యాటక అందాలు, వారసత్వ కట్టడాలను సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల చేత ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ టూరిజం గొప్ప తనాన్ని చెబుతూ తాజాగా ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున(Film actor Nagarjuna) వీడియో విడుదల చేశారు. రామప్పు, వేయి స్తంభాల గుడి, భోగతా వాటర్ ఫాల్స్, యాదగిరిగుట్ట ఇలా అనేక ప్రదేశాల గురించి చక్కగా వివరించారు. ఇంకా అంకాపూర్ నాటుకోడి, జొన్నరొట్టెలు, సర్వపిండి, హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ అంటే తనకు చాలా ఇష్టమని నాగార్జున చెప్పుకొచ్చారు.

ప్లీజ్ తెలంగాణను విజిట్ చేయండి అని చివర్లో ప్రపంచ పర్యాటకులకు రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ పిలుపు మేరకు ఇప్పటికే వివిధ సినీ హీరోలు, నటుడు డ్రగ్స్‌ వాడకానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. వాటితో కలిగే నష్టాలను వివరిస్తున్నారు. ఇప్పటి వరకు సినిమా రిలీజ్ టైంలోనే నటులు ఇలాంటి ప్రచారంలో పాల్గొనే వాళ్లు. రేవంత్ సూచనతో సినిమా రిలీజ్ లేకపోయినా ప్రభాస్ లాంటి నటులు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం కల్పిస్తున్నారు. అదే మాదిరిగా పర్యాటకంపై కూడా నాగార్జున వీడియో చేశారు.

Advertisement

Next Story