లారీని ఢీకొని యువకుడు దుర్మరణం

by Sridhar Babu |
లారీని ఢీకొని యువకుడు దుర్మరణం
X

దిశ, మానకొండూరు : నేషనల్ హైవే పై ఈదులగట్టేపల్లి గ్రామ సమీపంలో లారీని ఢీకొట్టిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పెద్దూర్ పల్లె గ్రామానికి చెందిన గంగినేని అజయ్ (22) జాతీయ రహదారిపై బైకుపై లారీ వెనకాలే వెళ్తున్నాడు. ఈ క్రమంలో లారీ డ్రైవర్ ఆకస్మికంగా బ్రేకులు వేయడంతో అదుపు తప్పి లారీని ఢీకొట్టాడు. దాంతో తలకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ గుంజ సుధాకర్ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story