Bharat Mobility Global Expo 2025: కారు ప్రేమికుల కోసమే ఈ వార్త.. ఆటో ఎక్స్‌పో లో BMW ప్రదర్శించే కార్లు ఇవే

by Bhoopathi Nagaiah |
Bharat Mobility Global Expo 2025: కారు ప్రేమికుల కోసమే ఈ వార్త.. ఆటో ఎక్స్‌పో లో BMW ప్రదర్శించే కార్లు ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: Bharat Mobility Global Expo 2025: జనవరి 17వ తేదీ నుంచి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025 షురూ కానుంది. ఈ ఈవెంట్లో భారతీయ ఆటో కంపెనీలు తమ ప్రొడక్టులను ఆవిష్కరించే ఛాన్స్ ఉంది. పలు సంస్థలు భవిష్యత్తులో తాము ప్రకటించబోయే లేదా లాంచ్ చేసే వాహనాలను ప్రదర్శించనున్నాయి. ఈ ఎక్స్ పోలో బీఎండబ్ల్యూ కంపెనీ ఆల్ ఎలక్ట్రిక్ BMW i7, BMW X7, BMW 5 సిరీస్ లాంగ్ వీల్‌బేస్, BMW M5, BMW M4, BMW M2లను కూడా ప్రదర్శిస్తుంది. ఈ మధ్యే మార్కెట్లోకి వచ్చి న్యూ మినీ ఫ్యామిలీ MINI కూపర్ S, ఆల్-ఎలక్ట్రిక్ MINI కంట్రీమ్యాన్‌లను ప్రదర్శనలో ఉంచనుంది.

Bharat Mobility Global Expo 2025: బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్ ఇండియా తన ప్రముఖ మొబిలిటీ ఉత్పత్తులను రాబోయే ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్ ఇండియా పెవిలియన్ 2025 జనవరి 17 నుండి 22 వరకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని హాల్ నెం.6లో తన వాహనాలను ఎక్స్ పో చేయనుంది. బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా BMW, MINI, BMW మోటోరాడ్ నుండి అనేక కొత్త కార్లను లాంచ్ చేయనుంది. కంపెనీ ఆల్-ఎలక్ట్రిక్ BMW i7, BMW X7, BMW 5 సిరీస్ లాంగ్ వీల్‌బేస్, BMW M5, BMW M4, BMW M2లను కూడా ఈ ఎక్స్ పోలో ప్రదర్శించనుంది.

షోకేస్‌గా ఈ కార్లు:

బీఎండబ్ల్యూ మోటోరాడ్ (BMW Motorrad) కొత్త BMW R 1300 GS అడ్వెంచర్, కొత్త BMW S 1000 RR లాంచ్‌తో బీఎండబ్ల్యూ కార్ లవర్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపనుంది. బీఎండబ్ల్యూ మోటోరాడ్ షోకేస్‌లో BMW M 1000 XR, BMW R 1300 GS, BMW F 900 GS, BMW F 900 GSA, BMW R 12 9 T, BMW G 310 GS, G 310 R, G 310 Rlectric BMWe ఈ కార్లన్నీ ఉండనున్నాయి. అంతేకాదు ఈ ఎక్స్ పోలో BMW CE 04 కారును కూడా చేర్చనుంది . అదనంగా మినీఇండియా ప్రత్యేక MINI కూపర్ S జాన్ కూపర్ వర్క్స్ ప్యాక్‌ను విడుదల చేస్తుంది. ప్రత్యేకమైన BMW, MINI, BMW Motorradలకు సంబంధించిన లైఫ్ స్టైల్ కలెక్షన్స్ అండ్ యాక్ససరీస్ కూడా కొనుగోలు చేయడానికి ఈ ఎక్స్ పో అందుబాటులో ఉండనున్నాయి.

ఈ మధ్యే మర్కెట్లోకి లాంచ్ అయిన కొత్త మినీ ఫ్యామిలీ, మినీ కూపర్ ఎస్, ఆల్ -ఎలక్ట్రిక్ MINI కంట్రీమ్యాన్‌లను ఈ ఎక్స్ పోలో ఉండనున్నాయి. ఆటో ఎక్స్‌పో 2025లో మరింత ఉత్సాహాన్ని పెంచేందుకు, నిపుణులైన BMW డ్రైవర్, ట్రైనర్‌లు ప్రతిరోజూ అద్భుతమైన BMW M కార్లతో అద్భుతమైన డ్రిఫ్ట్ షోలను ప్రదర్శిస్తారు.

సరికొత్త BMW X3:

కొత్త BMW X3 మునుపెన్నడూ లేని విధంగా మరింత స్పోర్టీవ్ అప్పీల్, విజువల్ ఇంపాక్ట్, వెరిసిలిటీతో సరికొత్త BMW పాత్రను పోషిస్తుంది. BMW ఆపరేటింగ్ సిస్టమ్ 9 ఆధారంగా హై క్వాలిటీ మెటీరియల్స్, అధునాతన డిజిటలైజేషన్, క్విక్‌సెలెక్ట్‌తో కూడిన కొత్త BMW iDrive రూపొందించిన క్యాబిన్ లోపల ప్రీమియం వెదర్ కోసం టోన్‌ను సెట్ చేస్తుంది.

కొత్త BMW R 1300 GS అడ్వెంచర్:

ఆల్-కొత్త BMW R 1300 GS అడ్వెంచర్ అనేది బిగ్ అడ్వెంచర్ మోటార్‌సైకిళ్ల ప్రపంచంలో కొత్త బెంచ్‌మార్క్. ప్రతి మోడల్ అడ్వెంచర్ స్కిల్స్ తో పూర్తిగా రీడిజైన్ చేసిన మోడల్. ఈ కారులో రైడ్ ఫీచర్స్, వెహికల్ వెయిట్, అల్టిమేట్ స్పెషల్ రైడింగ్ ఫీలింగ్ ఉంటుంది. ఇక ఈ మోడల్ డిజైన్ చాలా అద్బుతంగా ఉంటుంది. BMW Motorrad కొత్త BMW S 1000 RR కూడా ఈ ఎక్స్‌పోలో తన మ్యాజిక్‌ను ప్రదర్శించనుంది.

Advertisement

Next Story