- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డుపై ఆటోలో ప్రసవించిన మహిళ..తల్లి బిడ్డ క్షేమం
దిశ, ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని పుర్య నాయక్ తండా లో గుంతల రోడ్లతో ఆటోలో మహిళ ప్రసవించిన ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. తండా వాసులు అందించిన వివరాల ప్రకారం... తండాకు చెందిన బానోతు స్వప్న పురిటి నొప్పులతో బాధపడుతోంది. కుటుంబీకులు ఆమెను ఆటోలో ఝరాసంగం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి తరలించే సమయంలో గుంతలు రోడ్డు కారణంగా సమయానికి చేరుకోక పోగా మార్గ మధ్యలో నడిరోడ్డుపై ఆటోలోనే ప్రసవించింది. తండాకు రోడ్డు పరిస్థితి దారుణంగా ఉందని అందుకు ఇతర వాహనాలు కొనసాగించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 108 వాహనం సైతం రోడ్ల బాగులేని కారణంగానే కాల్ చేయలేదని ఆవేదన చెందారు.
ఇదే విషయంపై "దిశ" ఝరాసంగం మండల వైద్యాధికారికి సంప్రదించగా ఆటోలో ప్రసవించిన మాట వాస్తవమేనని ప్రస్తుతం ఝరాసంగం ప్రాథమిక కేంద్రంలో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని మండల వైద్యాధికారిని డాక్టర్ రమ్య పేర్కొన్నారు. శిశువు 2.5 కేజీలు ఉందని అన్నారు. అత్యవసర వైద్య సేవలకు 108 లేదా డాక్టర్లను సంప్రదించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా గత సంవత్సరం రామ్ చందర్ నాయక్ తాండకు చెందిన ఓ మహిళ సైతం రోడ్డుపై ప్రసవించిందని తండావాసులు గుర్తు చేసుకున్నారు.
దారుణమైన రోడ్లు..
రాష్ట్రాలు మారి ప్రభుత్వాలు మారిన గిరిజన బతుకులు మాత్రం మారడం లేదు. ఎన్నికల సమయంలో గుర్తుకు వచ్చే తండాలు ఎన్నికలు ఫలితాలు వచ్చేసరికి తాండాలను, గ్రామాలను నాయకులు మరిచిపోవడం సర్వసాధారణమై పోయింది. ఝరాసంగం మండలంలోని పూర్యానాయక్, భోజనాయక్, టోప్యా నాయక్, రామ్ చందర్ నాయక్ తాండాలు నేటికీ రోడ్డు మార్గానికి నోచుకోలేదు. రోడ్ల కారణంగా అత్యవసర సమయంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆయా ఆయా తాండాలకు చెందిన ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.