- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Minister Seetakka : ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్ర ఉంది.. మంత్రి సీతక్క సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ (Food Poisoning) ఘటనలు రాష్ట్రంలో పొలిటికల్‌గా హీట్‌ను రాజేస్తున్నాయి. ఈ విషయంలో అధికార కాంగ్రెస్ (Congress), విపక్ష బీఆర్ఎస్ (BRS) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క (Minister Sitakka) సంచలన వ్యాఖ్యలు చేశారు. వరుస ఫుడ్ పాయిజన్ (Food Poisoning) ఘటన వెనుక కుట్ర దాగి ఉందంటూ కామెంట్ చేశారు. ఆ కుట్రలు ఎవరు చేశారనే విషయాన్ని త్వరలోనే బయటపెడతామని అన్నారు. ఒకవేళ కుట్రదారుల వెనుక అధికారులుంటే వారిని ఉద్యోగం నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఫుడ్ పాయిజన్ (Food Poisoning) ఘటన వెనుక ఓ రాజకీయ పార్టీ ఉందని తమకు అనుమానంగా ఉందని తెలిపారు.
ఆనాడు దిలావర్‌పూర్ (Dilawarpur)లో ఇథనాల్ ఫ్యాక్టరీ (Ethanol Factory)కి అనుమతులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని (BRS Government) ఫైర్ అయ్యారు. అక్కడి ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశారని గుర్తు చేశారు. నేడు మళ్లీ కేటీఆర్ (KTR) తమపై నిస్సిగ్గుగా మాపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. కంపెనీ డైరెక్టర్‌గా తలసాని సాయికిరణ్ (Thalasani Sai Kiran) ఉన్నాడని ఆరోపించారు. కేటీఆర్ (KTR)కు చిత్తశుద్ధి ఉంటే దిలావర్‌పూర్ (Dilawarpur)కు వచ్చి కడప జిల్లా (Kadapa District)కు చెందిన వాళ్లకు అనుమతులు ఇచ్చింది తనేనని ఒప్పుకోవాలని అన్నారు. అసెంబ్లీ (Assembly)లోనూ ఇథనాల్ కంపెనీ (Ethanol Company)పై చర్చ పెడతామని.. కేటీఆర్ (KTR) ఇచ్చిన అనుమతులను బయటపెడతామని మంత్రి సీతక్క అన్నారు.