అనుమానస్పద స్థితిలో మహిళ మృతదేహా అవశేషాలు..

by Aamani |
అనుమానస్పద స్థితిలో మహిళ మృతదేహా అవశేషాలు..
X

దిశ,కమలాపూర్: అనుమానాస్పద స్థితిలో మహిళ మృత దేహ అవశేషాలు లభ్యమైన సంఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది.గ్రామ శివారులో ని పొలం వద్ద మహిళ మృతదేహానికి సంబంధించిన అవశేషాలు ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు కాజీపేట ఏసీపీ తిరుమల్ , సీఐ హరికృష్ణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో మహిళ మృతదేహానికి సంబంధించిన చీర,జాకెట్టు, అవశేషాలను బట్టి పోలీసులు మృతురాలు వయసు 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలలోపు ఉంటుందని అంచనా వేశారు.ఆత్మహత్య ? హత్య ? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story