Gutta Sukhender Reddy : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరును స్వాగతించాలి : మండలి చైర్మన్ గుత్తా

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-06 12:04:19.0  )
Gutta Sukhender Reddy : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరును స్వాగతించాలి : మండలి చైర్మన్ గుత్తా
X

దిశ, వెబ్ డెస్క్ : పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru-Ranga Reddy Project)కు దివంగత నేత, కేంద్ర మాజీమంత్రి ఎస్. జైపాల్ రెడ్డి(S. Jaipal Reddy Name )పేరు పెట్టడం అభినందనీయమని.. ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఈ నిర్ణయాన్ని రాజకీయాలకు అతీతంగా స్వాగతించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Council Chairman Gutta Sukhender Reddy)అన్నారు. సోమవారం శాసన మండలిలోని తన ఛాంబర్ లో మీడియాతో చిట్ చాట్ లో గుత్తా మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధుప్రీతితో ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెడుతున్నారని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు.

హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్రం సాధించడం కొరకు కేంద్ర మంత్రి హోదాలో ఆయన ఎనలేని కృషి చేశారని, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకి జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్నీ తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే అవుతుందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ప్రస్తుత ప్రభుత్వం ఆర్ధిక సమస్యలను ,సవాళ్లను ఎదుర్కొంటుందని, అయినప్పటికీ రైతులను ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో, ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసాను జనవరి 26 నుండి ఎలాంటి షరతులు లేకుండా సేద్యం చేసే భూమికంతటికి ఇవ్వడం అభినందనీయమన్నారు.

రైతు భరోసాను రూ. "10000 నుండి రూ" 12000 పెంచడం గొప్ప నిర్ణయమని తెలిపారు. భూమిలేని రైతు కూలీలకు ఏటా 12000 రూపాయల సాయం అందించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం శుభపరిణామం అని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ప్రజాయోగ్యంగా ఉందని , ప్రతిపక్ష పార్టీలు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని ఆయన అన్నారు.

గతంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులు ఎఎల్బీసీ, డిండి , ఉదయసముద్రం ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజల్లో ఉంటూ, ప్రజల అభీష్టానికి అనుగుణంగా నడుచుకొవాలని ఆయన సూచించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల సపోర్ట్ ఎల్లవేళలా ఉంటుందని ఆయన తెలిపారు. విమర్శలు చేయడం , దుష్ప్రచారం చేయడమే పనిగా ప్రతిపక్ష పార్టీలు పెట్టుకోవద్దని, ప్రభుత్వానికి సరియైన సూచనలు, సలహాలు ఇస్తూ ప్రజలకోసం పని చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.

Advertisement

Next Story