- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం.. అనారోగ్యంతో ఇంటర్ విద్యార్థిని మృతి
దిశ,సిటీ బ్యూరో : కార్పొరేట్ ఇంటర్ కళాశాల యాజమాన్య నిర్లక్ష్యం తో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్థిని చనిపోయిన సంఘటన సోమవారం రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఉమ్మడి ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఓ కార్పొరేట్ జూనియర్ కళాశాల హాస్టల్ నల్గొండ జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని బైపీసీ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటుంది. మూడు రోజుల క్రితం అనారోగ్యంతో కళాశాల యాజమాన్యం కు చెప్పగా స్థానికంగా ఉన్న మందులను అందజేసినప్పటికీ తన ఆరోగ్య సమస్య సరికాలేదు. అయినప్పటికీ విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం చేరవేయకుండా ఆస్పత్రికి సైతం తీసుకు వెళ్లకపోవడంతో విద్యార్థిని ఆరోగ్యానికి క్షీణించింది.
చివరికి ఆదివారం సిటీలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా ఈ విషయంపై ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో విద్యార్థిని బంధువులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విద్యార్థిని అనారోగ్యం పాలు కాగా ఆసుపత్రికి తరలించి నప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.