Pawan Kalyan: ‘ఓజీ’ సినిమా గురించి టాప్ సీక్రెట్ రివీల్ చేసిన రామ్ చరణ్.. చర్చనీయాంశంగా మారిన ట్వీట్

by Hamsa |   ( Updated:2025-01-06 15:43:41.0  )
Pawan Kalyan: ‘ఓజీ’ సినిమా గురించి టాప్ సీక్రెట్ రివీల్ చేసిన రామ్ చరణ్.. చర్చనీయాంశంగా మారిన ట్వీట్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), శంకర్ కాంబోలో ‘గేమ్ ఛేంజర్’(Game changer) మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, ఎస్ జే సూర్య, సముద్రఖని(Samuthirakani) కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ మూవీ భారీ అంచనాల మధ్య జనవరి 10న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. రామ్ చరణ్ వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, బాలయ్య అన్‌స్టాపబుల్(Unstoppable Show) షోలో పాల్గొన్నారు. అయితే ఇందులో రామ్‌ చరణ్‌ను బాలయ్య ‘ఓజీ’ సినిమా గురించి ప్రశ్నించగా.. సమాధానం చెప్పినట్లు సమాచారం. తాజాగా, ఈ విషయాన్ని ఆహా(Aha) సంస్థ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ఓజీ చిత్రాన్ని నిర్మిస్తున్న డీవీవీ సంస్థను బ్లాక్ మెయిల్ చేసింది. ‘‘ఓజీలో అకీరా ఉన్నాడు అంట? బాబాయ్ సినిమా గురించి అబ్బాయ్ ఇచ్చిన లీక్ చెప్పమంటారా? అని రాసుకొచ్చారు. అంతేకాకుండా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్(DVV Entertainments) ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా(Social Media)లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ ట్వీట్ చూసిన వారంతా ఆ సీక్రెట్‌ను తెలుసుకోవాలని అన్‌స్టాపబుల్ పూర్తి ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read More...

Ram Charan: ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం.. చాలా బాధగా ఉంది: రామ్ చరణ్


Advertisement

Next Story