- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేపు మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం..
దిశ, కామారెడ్డి : కామారెడ్డి మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారం మంగళవారం స్థానిక గంజ్ మార్కెట్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో జరగనుంది. ఈ కార్యకమానికి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ హాజరుకానున్నారు. చైర్మన్ గా ధర్మగోని లక్ష్మీ రాజగౌడ్, వైస్ చైర్మన్ గా మినుకూరి బ్రహ్మానంద రెడ్డితో పాటు మరొక 12 మంది సభ్యులతో నూతన పాలకవర్గం కొలువుతీరనుంది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మూడు సార్లు ఆ గ్రామానికే...
ఈసారి నూతన చైర్మన్ ఎంపికకు ప్రత్యేకత సంతరించుకుంది. కామారెడ్డి మార్కెట్ కమిటీ ఏర్పడిన 1962 సంవత్సరం నుంచి ఇప్పటివరకు 11 మంది మార్కెట్ కమిటీ చైర్మన్లుగా పని చేశారు. ఇందులో ఒక పర్యాయం మినహా వరుసగా మూడు సార్లు కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికే చైర్మన్ పదవులు వరించడం ప్రత్యేకమని చెప్పాలి. గ్రామానికి చెందిన గట్టగొని రాజమని 20.06.2016 నుంచి 19.06.2018 వరకు పనిచేయగా ఆమె భర్త గట్టగొని గోపిగౌడ్ 23.07.2018 నుంచి 22.07.2020 వరకు చైర్మన్లుగా పని చేశారు. ప్రస్తుత చైర్మన్ కాకుండా రెండుసార్లు భార్యా భర్తలే వరుసగా చైర్మన్లుగా కొనసాగడం కొసమెరుపు. ప్రస్తుతం చైర్మన్ కూడా చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన వ్యక్తే కావడం గమనార్హం.