Big Breaking: కేటీఆర్ నివాసంలో ఏసీబీ రెయిడ్స్!

by Prasad Jukanti |   ( Updated:2025-01-06 13:36:45.0  )
Big Breaking: కేటీఆర్ నివాసంలో ఏసీబీ రెయిడ్స్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫార్ములా - ఈ కార్ రేసు కేసులో (Formula -E Car Race) మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గచ్చిబౌలిలోని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కు చెందిన ఓరియన్ విల్లాస్ లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 2న తేదీన ఇచ్చిన నోటీసుల మేరకు ఇవాళ కేటీఆర్ విచారణ నిమిత్తం ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ తన న్యాయవాదితో కలిసి విచారణకు పోలీసులు అనుమతి ఇవ్వక పోవడంతో తన వివరణతో కూడిన లేఖను అధికారులకు అందజేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే తన ఇంట్లో ఏసీబీ రెయిడ్స్ జరుగుతాయని ఇవాళ ఉదయమే కేటీఆర్ మీడియాతో చెప్పారు. కేటీఆర్ చెప్పినట్లుగానే సాయంత్రానికి తనిఖీలు జరుగుతున్నట్లు ప్రరచారం జరుగుతుండటం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ తనిఖీల విషయాన్ని ఏసీబీ అధికారులు, బీఆర్ఎస్ శ్రేణులు ఖండిస్తున్నారు. ఈ అంశంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

Next Story