- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ రుణమాఫీ చేశాము
దిశ, జగిత్యాల ప్రతినిధి : కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వానికి భారమైనా రూ.21 వేల కోట్లు అప్పు చేసి రెండు లక్షల రుణమాఫీ చేశామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతు భరోసా అంటూ బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఎకరాకు ఏటా 12 వేల చొప్పున అందిస్తామని తెలిపారు. అయితే గత ప్రభుత్వం రాళ్లు, రప్పలు, రియల్ ఎస్టేట్ భూములకు ఇచ్చినట్లు కాకుండా సాగు భూములకే ఇస్తామని స్పష్టం చేశారు.
అంతేకాకుండా రైతు కూలీలకు ఏటా 12,000 సాయం అందిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన రోజుల వ్యవధి నుంచే పథకాల అమలును ప్రారంభించామని అన్నారు. 12 నెలల్లో 55 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వివరించారు. పదేళ్లు పాలించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణమాఫీ ఎందుకు చేయలేకపోయిందని ప్రశ్నించారు. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు అయినా మంజూరు చేయలేదని, కానీ తాము త్వరలోనే అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇస్తామన్నారు. రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు అనవసరపు విమర్శలు మాని ప్రజలకు మంచి జరిగితే హర్షించాలని హితవు పలికారు.