మరో జన్మ ఉంటే ప్రభాస్ లాంటి కొడుకు కావాలి.. సీనియర్ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |
మరో జన్మ ఉంటే ప్రభాస్ లాంటి కొడుకు కావాలి.. సీనియర్ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా కల్కి2898 ఏడీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం రాజా సాబ్, కల్కి 2, సలార్ 2, ఫౌజీ, స్పిరిట్ వంటి వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. అయితే ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాజా సాబ్. ప్రస్తుతం ఈ చిత్రం ఆన్ సెట్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటి జరీనా వహాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆన్ సెట్స్‌లో ప్రభాస్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ `తదుపరి జన్మ అంటూ ఉంటే అక్కడ నాకు ప్రభాస్ లాంటి కొడుకు కావాలని కోరుకుంటున్నాను. అతడు ఎంతో డౌన్ టు ఎర్త్. పెద్దలంటే ఎంతో గౌరవంతో ఉంటారు. ప్రభాస్ లాంటి వ్యక్తిని ఇంతవరకు నా కెరీర్‌లో చూడలేదు, ఎదురు కాలేదు. అతను ఓ పెద్ద స్టార్. కానీ షూట్ పూర్తయిన తర్వాత అందరితో ఎంతో సరదాగా ఉంటారు. సెట్స్ నుంచి వెళ్లేటప్పుడు అందరికీ వీడ్కోలు చెబుతారు. సెట్స్‌లో ఎవరైనా ఆకలితో ఉన్నారు? అని తెలిస్తే వెంటనే ఇంటికి ఫోన్ చేసి నలభై మందికి భోజనం రెడీ చేయమని చెబుతారు.

ఆ భోజనం వెంటనే రావాలని ఆర్డర్ వేస్తారు. ప్రభాస్ స్వీట్ హార్ట్. నేటి జనరేషన్‌కి అతడు ఆదర్శం. పెద్దల పట్ల ఎలా నడుచుకోవాలో అన్ని తెలిసిన వ్యక్తి. యువకులు అతన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి` అని జరీనా వహాబ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed